Saturday, November 7, 2026
Homeక్రైమ్ న్యూస్అల్వాల్‌లో భారీగా డిఫెన్స్ మద్యం పట్టివేత

అల్వాల్‌లో భారీగా డిఫెన్స్ మద్యం పట్టివేత

📰 Generate e-Paper Clip

🔸రెండు చోట్ల దాడుల్లో 163 బాటిళ్లు సీజ్.. విలువ రూ.2.11 లక్షలు

ఆర్ జె న్యూస్, అల్వాల్ : డిఫెన్స్ క్యాంటీన్ కోటాలో తక్కువ ధరకు తెచ్చిన మద్యాన్ని ఇళ్ల వద్ద అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. అల్వాల్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల నిర్వహించిన దాడుల్లో మొత్తం 163 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మద్యం విలువ సుమారు రూ.2.11 లక్షలుగా అంచనా వేస్తున్నారు. మల్కాజ్‌గిరి ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం లోతుకుంట సరస్వతి నగర్‌లోని ఓ ఇంటిపై దాడి చేసింది. మన్యం నాగప్రసన్న, ఆమె భర్త రామాంజనేయులు డిఫెన్స్ మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడి చేపట్టారు. తనిఖీల్లో 96 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. భర్త రామాంజనేయులు క్యాంటీన్ కోటాలో మద్యం తెస్తుండగా, భార్య నాగప్రసన్న ఇంటి వద్ద నుంచే విక్రయాలు చేస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్ రావు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి, నాగప్రసన్నను అరెస్ట్ చేసి అల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. మరో ఆపరేషన్‌లో స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్-బి సీఐ గణపతి రెడ్డి ఆధ్వర్యంలో న్యూ బోయిన్‌పల్లి సౌజన్య కాలనీలోని ఓ ఇంటిపై దాడి చేశారు. ముసిమి లెంక (39) వద్ద నుంచి 67 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసి అల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. రెండు కేసుల్లోనూ ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!