🔸భారత్ పెట్రోల్ బంక్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
🔸అధికారులకు కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు నవీన్ ముత్రాజ్ ఫిర్యాదు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : పెట్రోల్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓ వినియోగదారుడు అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది. మైసమ్మగూడ వెళ్లే రహదారిలోని భారత్ పెట్రోల్ బంక్‌లో రూ.200 విలువైన పెట్రోల్ పోయించుకున్న కొద్దిసేపటికే తన వాహనం అకస్మాత్తుగా నిలిచిపోయిందని గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు నవీన్ ముత్రాజ్ ఆరోపించారు.వాహనం నిలిచిపోవడంతో తిరిగి పెట్రోల్ బంక్‌కు వెళ్లి పెట్రోల్‌లో నీరు కలిసిందా? అంటూ సిబ్బందిని ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ విషయంపై బంక్ యజమాని కిషోర్ రెడ్డిని సంప్రదించగా, తమ బంక్‌లో నాణ్యమైన పెట్రోల్ మాత్రమే విక్రయిస్తున్నామని సమాధానమిచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు.ఈ ఘటనపై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినట్లు నవీన్ వెల్లడించారు. సంబంధిత అధికారులు వెంటనే పెట్రోల్ నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, బంక్‌పై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. కల్తీ జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించాలని ఆయన కోరారు.
