మేడ్చల్ ఆర్ జె న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జూలై 4 :
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడంతో స్థానికంగా కలకలం రేపింది. సబ్ ఇన్స్పెక్టర్ యతీష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పారిశ్రామిక వాడలోని రోడ్డు పక్కన సుమారు 40 నుండి 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు స్కై బ్లూ రంగు చొక్కా, నేవీ బ్లూ రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహంపై ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా ఆధారాలు లేకపోవడంతో మృతుడి వివరాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృత్యుకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు.మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే మేడ్చల్ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ యతీష్ చంద్ర కోరారు.
