Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లాఇంకుడు గుంతలతో భూగర్భ జలాల పెంపు...

ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల పెంపు ‘క్యాచ్ ది రైన్–2026’ను విజయవంతం చేయాలి: చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :
భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇంటి వద్ద, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, అపార్ట్‌మెంట్లలో తప్పనిసరిగా వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కె. శిరీష కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.జల్ శక్తి అభియాన్‌లో భాగంగా నిర్వహిస్తున్న ‘క్యాచ్ ది రైన్–2026′ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకించడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని, బోర్‌వెల్‌లలో నీటి లభ్యత మెరుగై తాగునీటి సమస్యలు తగ్గుతాయని తెలిపారు.వర్షపు నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ర్యాలీలు, వాల్ పెయింటింగ్స్, పోస్టర్లు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి వనరుల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, “ఈ రోజు భద్రపరిచే ప్రతి వర్షపు నీటి చుక్క రేపటి తరాలకు అమూల్యమైన ఆస్తి” అని అన్నారు.’క్యాచ్ ది రైన్–2026’ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!