Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లాకాంగ్రెస్‌లో ఐక్యతే విజయానికి బాట

కాంగ్రెస్‌లో ఐక్యతే విజయానికి బాట

ఆర్ జె న్యూస్, మేడ్చల్: రానున్న జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తొటకూర వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్‌లో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు.
👉🏻 సింగిల్ విండోల్లో అర్హులకే ప్రాధాన్యం
మేడ్చల్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి అవగాహన ఉందని, అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని ప్రభుత్వ విప్ విజయరామారావు తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు సింగిల్ విండో సహకార సంఘాలకు చైర్మన్లు, 78 మంది డైరెక్టర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వ్యవసాయంపై అవగాహన ఉన్న వారికే సహకార సంఘాల్లో అవకాశం కల్పించాలని, రైతులకు న్యాయం జరిగేలా అర్హులైన వారిని ఎంపిక చేయాలని సూచించారు.
👉🏻 డివిజన్ కమిటీల్లో పొరపాట్లు సరిదిద్దుతాం
డివిజన్ అధ్యక్షుల నియామకాల్లో కొన్ని చిన్నపాటి పొరపాట్లు జరిగాయని, వాటిపై ఎవరి పట్లా కక్ష సాధింపు లేదని విజయరామారావు స్పష్టం చేశారు. సింగిల్ విండో కమిటీల్లో అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని, పార్టీ బలోపేతమే లక్ష్యంగా పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు.
👉🏻 మల్లారెడ్డిపై విమర్శలు
మాజీ మంత్రి మల్లారెడ్డిపై విజయరామారావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సొమ్మును దోచుకున్న వ్యక్తి మల్లారెడ్డి అని ఆరోపిస్తూ, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌లో అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారని, వారంతా కలిసికట్టుగా పనిచేస్తే విజయాలు సాధించడం ఖాయమన్నారు.
👉🏻 చీకటి ఒప్పందాలు వీడాలి
డీసీసీ అధ్యక్షుడు తొటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు, సీనియర్ నాయకులకు సముచిత ప్రాధాన్యం కల్పించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. డివిజన్ కమిటీల్లో ఎక్కడైనా అన్యాయం జరిగితే జిల్లా కమిటీ దృష్టికి తీసుకువస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
రూ.750 కోట్లతో అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం 6 వేల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 57 వేల మందికి ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.750 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వేగం పెరిగిందన్నారు.
బీఆర్ఎస్‌పై పోరాటం కొనసాగుతుంది
రేపు జరిగే ఎన్నికలు వ్యక్తులవి కాదని, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు సంబంధించినవని వజ్రేష్ యాదవ్ పేర్కొన్నారు. ప్రత్యర్థులు కాంగ్రెస్ నాయకులు కాదని, బీఆర్ఎస్ నాయకులేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌తో రహస్య ఒప్పందాలు చేసుకునే వారిని ప్రజలు గమనిస్తున్నారని, ఆ పార్టీ అవినీతిపై కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.
👉🏻 ఐక్యతతోనే విజయం
రానున్న ఎన్నికలు, డిలిమిటేషన్ తర్వాత ఏర్పడే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరని, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే విజయం సాధించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్,మాజీ జడ్పీటీసీ శరత్ చంద్ర రెడ్డి,డివిజన్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్,సందీప్ గౌడ్,సురేందర్ ముదిరాజ్, చాప రాజు,శ్రీకాంత్ యాదవ్ , ఆలియాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ శిరీష్ కృష్ణ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాల్ రెడ్డి,మాజీ మండల అధ్యక్షుడు రమణ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్,అలియాబాద్ మున్సిఅల్ అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!