ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా గోమారం బాల్‌రెడ్డిని నియమిస్తూ డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తొటకూర వజ్రేష్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ, కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నియామక పత్రంలో పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, డీసీసీ అధ్యక్షుడు తొటకూర వజ్రేష్ యాదవ్‌కు గోమారం బాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 298 కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ,కాంగ్రెస్ నాయకులు శంకర్,సంతోష్ గౌడ్,మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ ఉపాధ్యక్షుడిగా గోమారం బాల్‌రెడ్డి..! నియామక ఉత్తర్వులు అందజేసిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
RELATED ARTICLES
