Monday, September 7, 2026
Homeఇంటర్నేషనల్హిమాచల్‌లో అదృశ్యమైన హైదరాబాద్ రైడర్

హిమాచల్‌లో అదృశ్యమైన హైదరాబాద్ రైడర్

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని దుర్గమ పర్వత ప్రాంతాల్లో గత 20 రోజులుగా అదృశ్యమైన హైదరాబాద్‌కు చెందిన బైక్ రైడర్ అనిల్ మార్లా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అనిల్ క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ హైదరాబాద్ యునైటెడ్ మోటర్ సైక్లిస్ట్ కమ్యూనిటీ సభ్యులు బుధవారం అల్వాల్ పరిధిలోని హకింపేట్‌లోని ఉత్సవ్ కన్వెన్షన్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

🔸జాన్స్కార్ లోయలో చివరిసారిగా
జూలై 19న జాన్స్కార్ లోయలోని పదుమ్ నుంచి లాహౌల్ వైపు బైక్‌పై ఒంటరిగా ప్రయాణం ప్రారంభించిన అనిల్.. షింకు లా – లాహౌల్ లోయ ప్రాంతంలో కనిపించకుండా పోయినట్లు రైడింగ్ కమ్యూనిటీ సభ్యులు తెలిపారు. అనిల్ ఉపయోగించిన బైక్ మాత్రమే లభించింది. ఆయన ఆచూకీ ఇంకా తెలియరాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

🔸 SDRF, డ్రోన్‌లతో ముమ్మర గాలింపు
సమాచారం అందుకున్న వెంటనే SDRF బృందాలు, హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు, స్థానిక వాలంటీర్లు, డ్రోన్ బృందాలు కష్టతరమైన పర్వత ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు.

🔸 ఒక్కటైన రైడింగ్ కమ్యూనిటీ

అనిల్ కోసం హైదరాబాద్ రైడింగ్ కమ్యూనిటీ మొత్తం ఒక్కటైంది. లక్డికపూల్ నుంచి హకింపేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. “అనిల్ క్షేమంగా తిరిగి రావాలి. హైదరాబాద్ రైడింగ్ కుటుంబం ఎప్పుడూ అనిల్‌కు అండగా ఉంటుంది” అని రైడర్లు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాకబ్, కెవిన్, ప్రణీత్, విష్ణు, చైతన్య, వినయ్, ఇమ్మాన్యూల్, సుబోధ్, సామ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!