Monday, September 7, 2026
Homeక్రైమ్ న్యూస్రావల్‌కోల్‌లో దొంగల హవా - స్థానికుల్లో...

రావల్‌కోల్‌లో దొంగల హవా – స్థానికుల్లో ఆందోళన

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపల్‌ పరిధిలోని రావల్‌కోల్‌ గ్రామంలో వరుస చోరీలు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగులు ఒకే ప్రాంతంలో మూడు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. ఇళ్లలో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చేసుకుని తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు సమాచారం.బందెల ముత్యాల ఇంటితోపాటు మరో రెండు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 9 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.2 లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇళ్లకు తిరిగి వచ్చిన అనంతరం చోరీలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
🔸 సీసీ కెమెరాలపై దృష్టి
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాలకు చేరుకుని వివరాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తూ దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఒకే ప్రాంతంలో మూడు ఇళ్లలో చోరీలు జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!