Monday, September 7, 2026
Homeతెలంగాణహైదరాబాద్పెద్ది కుటుంబానికి పెద్ద దిక్కుగా కేసీఆర్..!...

పెద్ది కుటుంబానికి పెద్ద దిక్కుగా కేసీఆర్..! 2 కోట్ల 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, హైదరాబాద్ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీ తరఫున రూ.2 కోట్ల 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ పరిస్థితిని పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించారు. అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

🔸పిల్లలకు చెరో కోటి
సుదర్శన్ రెడ్డికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తు, చదువు దృష్ట్యా ఇద్దరికీ చెరో రూ.1 కోటి చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేసీఆర్ నిర్ణయించారు.

🔸 తల్లి పేరిట రూ.25 లక్షలు
వృద్ధాప్యంలో ఉన్న సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో జమ చేయాలని ఆదేశించారు. మొత్తంగా రూ.2 కోట్ల 25 లక్షల ఆర్థిక సహాయాన్ని పెద్ది కుటుంబానికి అందించనున్నట్లు బీఆర్ఎస్ వెల్లడించింది.

🔸పార్టీ నిరంతరం అండగా ఉంటుంది
పిల్లల చదువు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. కష్టకాలంలో పార్టీ కుటుంబాలను వదిలిపెట్టదని, పెద్ది కుటుంబానికి తాను పెద్ద దిక్కుగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!