ఆర్.జె.న్యూస్, కూకట్పల్లి: పుట్టినరోజును అక్క వాళ్ళ ఇంట్లో జరు పుకుంటానని వెళ్ళిన యువకుడు అదృశ్యమైన సంఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండకు చెందిన నర్సింగ్ రామ్(29) రామ్ నరేష్ నగర్లో స్నేహితులతో కలిసి గదిని అద్దెకు తీసుకుని ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా 8వ తేదీ నర్సింగ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా బోడుప్పల్లో నివాసం ఉంటున్న తన అక్క ఇంటికి వెళుతున్నానని స్నేహితుడికి చెప్పి బయలు దేరాడు. సాయంత్రం వరకు రాకపోవడంతో అతడి బావ చీకటి సోమన్న నర్సింగ్ రామ్ స్నేహితుడికి కాల్ చేయగా ఉదయం గది నుంచి వెళ్ళి పోయాడని చెప్పాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండ టంతో బావ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
