Tuesday, September 8, 2026
Homeమేడ్చల్ జిల్లామేడ్చల్‌లో కాంగ్రెస్ కమిటీల బలోపేతానికి కసరత్తు

మేడ్చల్‌లో కాంగ్రెస్ కమిటీల బలోపేతానికి కసరత్తు

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్–కిష్టాపూర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ కమిటీల బలోపేతంపై నాయకులు సమావేశమయ్యారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్,చాప రాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డివిజన్ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షుల పేర్ల సేకరణపై చర్చించారు.సమావేశానికి డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి గజ్జల కాంతం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, అనుబంధ సంఘాలకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రతి విభాగంలో విస్తృతం చేయడంపై నాయకులు చర్చించారు. అనుబంధ సంఘాల అధ్యక్షుల పేర్ల సేకరణను సమన్వయంతో పూర్తి చేసి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మైపాల్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, బాలు రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి సత్యనారాయణ, మాజీ మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!