Saturday, August 15, 2026
Homeక్రైమ్ న్యూస్పోలీసుల పేరుతో భారీ మోసం

పోలీసుల పేరుతో భారీ మోసం

🔸కీసరలో నకిలీ అధికారులుగా చెలామణి – ఇద్దరు అరెస్ట్..!
🔸రూ.23.91 లక్షల వరకు వసూలు చేసినట్లు గుర్తింపు..!

ఆర్.జె.న్యూస్, కీసర : పోలీస్ అధికారుల పేర్లు చెప్పి ప్రజలను నమ్మించి భారీగా మోసం చేసిన ఇద్దరు నకిలీలను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అలగోలు శ్రీధర్, అలగోలు నందినిలు తమకు పోలీస్ శాఖతో పరిచయాలు ఉన్నట్లు, అధికారులను తెలుసని చెప్పి పలువురి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

🔸ఎలా మోసం చేశారంటే…
నిందితులు పోలీస్ అధికారుల పేర్లు, హోదాలను ఉపయోగించుకుని బాధితులను నమ్మించారు. బ్యాంకు రుణాలు, సివిల్ కేసులు, ఆస్తి వ్యవహారాల్లో సహాయం చేస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. 2020లో ఒక కేసులో శ్రీధర్ బ్యాంకు రుణానికి సహాయం చేస్తానని చెప్పి ఒక వ్యక్తి నుంచి రూ.4.50 లక్షలు తీసుకున్నాడు. మరో ఘటనలో తాను పోలీస్ అధికారినని చెప్పుకుని సివిల్ కేసులు, ఆస్తి సమస్యలు పరిష్కరిస్తానని డబ్బులు వసూలు చేశాడు. UPI, PhonePe ద్వారా మొత్తం రూ.5,42,417 వరకు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే నమ్మకంతో ఫిర్యాదుదారుల నుంచి మొత్తం రూ.11 లక్షలు వసూలు చేశారు. డబ్బులు తీసుకున్నాక శ్రీధర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, బాధితులకు కనిపించకుండా తిరిగాడు. నిందితుల గత చరిత్రను పరిశీలించగా శ్రీధర్‌పై ఇంతకుముందే పలు కేసులు ఉన్నట్లు తేలింది. ఇప్పటివరకు ఈ రెండు కేసుల్లో నిందితులు మొత్తం రూ.23,91,193 వరకు వసూలు చేసినట్లు పోలీసులు అంచనా వేశారు. నిందితుల నుంచి నగదు లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, ఫోన్ సంభాషణలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరికొందరు బాధితులు ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

🔸పోలీసుల హెచ్చరిక
ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ పోలీస్ అధికారుల పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని, కేసుల నుంచి బయటపడేలా చేస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దు. అనుమానం వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి” అని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!