ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : జీహెచ్ఎంసీ 297వ డివిజన్ రైలాపూర్‌లో సాయిరెడ్డి కుటుంబానికి చెందిన లతకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. నూతన ఇంటిని పొందిన లత కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో 297వ డివిజన్ అధ్యక్షుడు నడికోప్పు నాగరాజు, మాజీ పట్టణ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, చీర్ల రమేష్, రాఘవేంద్రగౌడ్, రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రైలాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం
RELATED ARTICLES
