ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : జవహర్ నగర్‌లో బోనాల జాతరను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులకు కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా జవహర్ నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సైదులు, సబ్ ఇన్‌స్పెక్టర్ రాము నాయక్‌లను చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు బింగి సతీష్ గౌడ్, అశోక్ గుప్తా, యాకచారి, బల్లి శ్రీధర్, మిట్టు, బబ్లూ ముదిరాజ్, కొమ్మురాజుల వెంకటేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
