🔸 వైస్‌చైర్మన్ రజిత దేవేందర్ తీరుపై స్థానికుల ఆగ్రహం
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని బండ మాదారం 19వ వార్డులో వీధిదీపం పనిచేయక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వీధిదీపం వెలగడం లేదని సంబంధిత వార్డు ప్రజాప్రతినిధికి సమాచారం ఇచ్చినా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించడం మినహా సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదని వాపోతున్నారు.వీధిదీపం వెలగకపోవడంతో రాత్రివేళల్లో చీకటి నెలకొంటోందని, దోమల బెడద కూడా అధికంగా ఉందని చెబుతున్నారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ప్రజాప్రతినిధి ఇంటి వద్ద వీధిదీపాలు వెలుగుతున్న తీరును చూపిస్తూ స్థానికులు వీడియోను విడుదల చేశారు.ప్రజల సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు ఇలా నిర్లక్ష్యం చేయడం సరికాదని, అధికారులు వెంటనే స్పందించి వీధిదీపాన్ని మరమ్మతు చేయడంతో పాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
