Tuesday, September 8, 2026
Homeమేడ్చల్ జిల్లాఎల్లంపేటలో శిథిలావస్థకు చేరిన ఇల్లు..! పెచ్చులూడి...

ఎల్లంపేటలో శిథిలావస్థకు చేరిన ఇల్లు..! పెచ్చులూడి తండ్రి, కూతురికి గాయాలు

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్,మేడ్చల్ జిల్లా: ఎల్లంపేట్ మున్సిపల్‌ పరిధిలోని తలారి బస్తీలో శిథిలావస్థకు చేరిన ఇంటి పైకప్పు పెచ్చు ఒక్కసారిగా ఊడిపడటంతో తండ్రి, కూతురికి గాయాలయ్యాయి. తలారి యాదగిరి (40), ఆయన కుమార్తె వైష్ణవి (13) ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న యాదగిరి కుటుంబానికి ప్రభుత్వం, మున్సిపల్‌ అధికారులు స్పందించి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరుతున్నారు.
🔸పక్కా ఇల్లు నిర్మించాలి
బాధితుడు యాదగిరి మాట్లాడుతూ.. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, రోజువారీ కూలీ పనులకు వెళ్తేనే కుటుంబం గడుస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇల్లు నివాసానికి ఏమాత్రం సురక్షితంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, స్థానిక కౌన్సిలర్లు స్పందించి తమ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!