Saturday, November 7, 2026
Homeమేడ్చల్ జిల్లాదుండిగల్‌లో భారీగా గంజాయి పట్టివేత

దుండిగల్‌లో భారీగా గంజాయి పట్టివేత

📰 Generate e-Paper Clip

425 కిలోల గంజాయి స్వాధీనం.. ఆరుగురు అరెస్టు

ఆర్ జె న్యూస్,కుత్బుల్లాపూర్‌ : దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి సోలాపూర్‌కు డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఔటర్‌ రింగ్‌రోడ్డుపై నిఘా ఏర్పాటు చేసిన కుత్బుల్లాపూర్‌ జోన్‌ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఈ ఆపరేషన్‌లో 425 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పట్టుబడిన నిందితులను దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గంజాయి రవాణా వెనుక ఉన్న వ్యక్తులు, ముఠా కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!