Sunday, September 20, 2026
Homeమేడ్చల్ జిల్లాబీఆర్టీయూ కృషితో శీలా ఫోం కార్మికులకు...

బీఆర్టీయూ కృషితో శీలా ఫోం కార్మికులకు వేతనాల పెంపు

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్,మేడ్చల్ : బీఆర్టీయూ కృషి ఫలితంగా శీలా ఫోం కంపెనీ కార్మికులకు వేతనాలు పెరగడం హర్షించదగ్గ విషయమని బీఆర్టీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, శీలా ఫోం కంపెనీ అధ్యక్షులు సంబు ప్రభాకర్ తెలిపారు. బీఆర్టీయూ యూనియన్ సలహాదారు నారాయణ, జిల్లా అధ్యక్షులు సంబు ప్రభాకర్ ఆధ్వర్యంలో యాజమాన్యంతో చర్చలు జరిపి వేతనాల పెంపు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిలో భాగంగా కంపెనీలో పనిచేసే జూనియర్ కార్మికులకు రూ.11 వేలు, సీనియర్ కార్మికులకు రూ.13,500 వేతనం పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కార్మికుల ఐక్యత, యాజమాన్యం సహకారంతోనే ఈ వేతన పెంపు సాధ్యమైందని నాయకులు తెలిపారు. వేతనాలు పెరగడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శీలా ఫోం ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సయ్యద్ సిరాజుద్దీన్, సభ్యులు శ్రీనాథ్, చిల్ల నవీన్ కుమార్, భీము నాయుడు, నరేష్, స్మరణ్ కుమార్, జయ జ్యోతి, లంక, జీరు ఎర్రయ్య, ఎన్. ప్రభాకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!