ఆర్ జె న్యూస్, శామీర్ పేట : మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం అలియాబాద్ గ్రామంలో శ్రీ మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గురువారం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వందలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. భక్తుల విజ్ఞప్తి మేరకు రాత్రి వినాయక మండపం వద్ద ప్రొజెక్టర్ ద్వారా భక్తి చిత్రం ‘ఇరుముడి’ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అలియాబాద్ వినాయక మండపంలో అన్నదానం, ఇరుముడి సినిమా ప్రదర్శన
RELATED ARTICLES
