Thursday, July 2, 2026
Homeరాజకీయంబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఈటల శుభాకాంక్షలు..!...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఈటల శుభాకాంక్షలు..! పదవీకాలం ఏడాది పూర్తి – శాలువాతో సత్కరించిన మల్కాజిగిరి ఎంపీ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 30 : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో పార్టీ బలోపేతమైందని, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారని కొనియాడారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.రాష్ట్ర అధ్యక్షుడు స్పందిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తల సహకారంతోనే ఏడాది పాలన విజయవంతమైందని, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!