మేడ్చల్, జూన్ 30 ( ఆర్ జె న్యూస్ ) : మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ గ్రామం 7వ వార్డులో గాదె మంజుల-శ్రీనివాస్ దంపతులు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై గృహప్రవేశాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ “పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంత ఇళ్ల కలను నెరవేర్చుకుంటున్నాయి. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది” అని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తుంకి రమేష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సామల జశ్వంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏళ్ల మల్లేష్, నాయకులు అబ్బాగౌని భాస్కర్ గౌడ్, మేడి మల్లేష్, తంటం యాదగిరి, కోడూరు దినేష్, చిలుగురి మల్లేష్, బండారి బాబు, నేమురి రాంప్రసాద్, జమాల్పూర్ బన్సీలాల్, ముద్దం వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలియాబాద్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం..! లబ్ధిదారుల ఇంటిని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శిరీష కృష్ణారెడ్డి..!
RELATED ARTICLES
