Sunday, August 16, 2026
Homeఎడిటోరియల్వృద్ధురాలి పుస్తెలతాడు చోరీ కేసు: నిందితుడు...

వృద్ధురాలి పుస్తెలతాడు చోరీ కేసు: నిందితుడు అరెస్ట్. 4 తులాల బంగారం, యాక్టివా స్వాధీనం.

కీసర, జూన్ 30: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల గ్రామంలో వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 4 తులాల బంగారం, నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.జూన్ 26న చిర్యాల గ్రామానికి చెందిన వృద్ధురాలు సింగిరెడ్డి మల్లమ్మ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన దుండగుడు ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కీసర పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సోమవారం నిందితుడు కత్తి అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. విచారణలో అప్పుల కారణంగానే దోపిడీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసును త్వరగా ఛేదించిన కీసర ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు, ఎస్‌ఐ అనిల్ కుమార్‌తో పాటు సిబ్బందిని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ఐపీఎస్ అభినందించారు.

పోలీసుల సూచన : వృద్ధులు ఒంటరిగా ఉన్న సమయంలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులను బహిరంగంగా ధరించవద్దని పోలీసులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!