Wednesday, July 1, 2026
Homeఎడిటోరియల్101 కార్లతో అలంపూర్‌కు విజయ సంకల్ప...

101 కార్లతో అలంపూర్‌కు విజయ సంకల్ప యాత్ర. జూన్ 29న జోగులాంబ క్షేత్రంలో ఉద్యమకారుల ప్రత్యేక కార్యక్రమం

📰 Generate e-Paper Clip

శామీర్‌పేట, జూన్ 30 : తెలంగాణ ఉద్యమ స్పూర్తిని చాటుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో భారీ విజయ సంకల్ప యాత్రకు సన్నాహాలు పూర్తయ్యాయి. అంబాజీపేట నుంచి అలంపూర్ వరకు 101 కార్లతో మహా ర్యాలీ నిర్వహించనున్నారు.

రాష్ట్ర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఫోరం నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యమకారులు శామీర్‌పేటలోని ఉద్యమకారుడు మైసయ్య ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి కార్యక్రమ సన్నాహాలను ప్రారంభించారు.

జూన్ 29, 2026 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ జోగులాంబ అమ్మవారి క్షేత్రం అలంపూర్‌లో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. అంబాజీపేట నుంచి ప్రారంభమయ్యే ఈ 101 కార్ల ర్యాలీ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ వేడుకలో తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని నిర్వాహకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!