Thursday, September 10, 2026
Homeతెలంగాణహైదరాబాద్CEIR పోర్టల్ మాయాజాలం, బాధితులకు ఫోన్లు...

CEIR పోర్టల్ మాయాజాలం, బాధితులకు ఫోన్లు అప్పగించిన ఏసీపీ!

📰 Generate e-Paper Clip

మాదన్నపేట (ఆర్ జె న్యూస్) జూలై 9 :

పోలీసులు సాంకేతికతను వినియోగించి మాదన్నపేట మరియు సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 20 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించడం జరిగింది . సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లను సైతం ట్రేస్ చేసి రికవరీ చేసిన పోలీసులు.మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌తో పాటు సాంకేతిక దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 20 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. బుధవారం సైదాబాద్ డివిజన్ ఏసీపీ ఎస్. వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో బాధితులకు వారి మొబైల్ ఫోన్లను అందజేశారు. వేర్వేరు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఫోన్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే వాటిని గుర్తించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ప్రజలకు పోలీసులు సూచించడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!