Thursday, October 29, 2026
Homeమేడ్చల్ జిల్లాకార్మిక హక్కుల పరిరక్షణకు సీఐటీయూ మహాధర్నా

కార్మిక హక్కుల పరిరక్షణకు సీఐటీయూ మహాధర్నా

📰 Generate e-Paper Clip

🔸ఈ నెల 25, 26 తేదీల్లో ఇందిరాపార్క్‌ వద్ద ఆందోళన

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : కార్మిక చట్టాలు, హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు పిలుపునిచ్చారు. శుక్రవారం కీసర ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద హెచ్‌ఎండీఏ కాంట్రాక్టు కార్మికుల సమక్షంలో మహాధర్నా గోడపత్రికను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ప్రతి నెల ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని కోరారు. కార్మికులందరికీ ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించడంతో పాటు వారాంతపు సెలవులు అమలు చేయాలని, తొమ్మిది రకాల భద్రతా పరికరాలు అందించాలని పేర్కొన్నారు.
అర్బన్‌ ఫారెస్ట్రీ, పార్కులు, ఇంజినీరింగ్‌, పారిశుద్ధ్య విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను క్రమబద్ధీకరించాలని, కాంట్రాక్టు గడువు ముగిసినా విధుల నుంచి తొలగించకుండా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో షామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్‌ ప్రాంతాలకు చెందిన హెచ్‌ఎండీఏ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!