Tuesday, October 27, 2026
Homeతెలంగాణఖమ్మంబైక్ స్టంట్లతో హల్ చల్ -...

బైక్ స్టంట్లతో హల్ చల్ – పట్టుబడ్డ 20 ఏళ్ల యువకుడు – ఖమ్మంలో పోలీసుల నిఘా

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : రోడ్లపై ప్రమాదకర బైక్ స్టంట్లతో హల్ చల్ చేస్తూ, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువతపై ఖమ్మం రూరల్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బైక్ స్టంట్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ప్రమాదకరంగా బైక్ విన్యాసాలు చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేశారు. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన ఐతగాని అజయ్ కుమార్ (20) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు గుర్తించి, శనివారం అతనిపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం రూరల్ సీఐ ముష్క రాజు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రోడ్లు ప్రజలందరి ప్రయాణానికి ఉద్దేశించినవని, వాటిపై ప్రమాదకర విన్యాసాలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. బైక్ స్టంట్లపై నిఘా విభాగంతో పాటు పోలీసు శాఖలోని అన్ని విభాగాలు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ పట్టుబడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత క్షణిక సరదా కోసం తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!