Saturday, October 3, 2026
Homeమేడ్చల్ జిల్లాఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్‌ పోరాటం

ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్‌ పోరాటం

📰 Generate e-Paper Clip

ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై మేడ్చల్‌లో భారీ నిరసన.. ఈసీ దిష్టిబొమ్మ దహనం

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్‌లో భారీ నిరసన చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌ సూచనలతో మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ వద్ద వైఎ్‌సఆర్‌ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ సాగింది. అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం చేయాలని కోరారు.అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకూడదని వజ్రేష్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేడ్చల్‌ 297 డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్‌, పూడూర్‌–కిష్టాపూర్‌ 298 డివిజన్‌ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్‌గౌడ్‌, గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌ అధ్యక్షుడు గరిసెల సురేందర్‌ ముదిరాజ్‌తో పాటు కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, మైనారిటీ, మహిళా కాంగ్రెస్‌, ఎస్సీ, బీసీ, ఎస్టీ సెల్‌, ఐఎన్‌టీయూసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!