Saturday, October 3, 2026
Homeమేడ్చల్ జిల్లామేడ్చల్ సీఎస్ఐ వెస్లీ చర్చిలో ఘనంగా...

మేడ్చల్ సీఎస్ఐ వెస్లీ చర్చిలో ఘనంగా 80వ ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే వేడుకలు

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ సిఎస్ఐ వెస్లీ చర్చిలో 80వ సిఎస్ఐ ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే సర్వీస్ ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల విశ్వాసం, ధైర్యం, కుటుంబం, చర్చి, సమాజంలో వారి పాత్రపై సందేశాలు అందించారు.

క్రైస్తవ ఐక్యతకు ప్రతీక

చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న నిర్వహిస్తారు. 1947 సెప్టెంబర్ 27న దక్షిణ భారతదేశంలోని ఆంగ్లికన్, మెథడిస్ట్, కాంగ్రిగేషనల్, ప్రెస్బిటేరియన్ తదితర ప్రొటెస్టెంట్ సంప్రదాయాల సమ్మేళనంతో సిఎస్ఐ ఏర్పడింది. క్రైస్తవ ఐక్యత, సేవా స్ఫూర్తికి ఈ దినోత్సవం ప్రతీకగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

మహిళల పాత్ర కీలకం

ఎం. శ్రీలత దేవుని వాక్యాన్ని బోధిస్తూ చర్చి, సమాజంలో మహిళల ప్రాముఖ్యతను వివరించారు. దేవుణ్ణి నమ్మకంగా, నిర్భయంగా విశ్వసిస్తూ మహిళలు కుటుంబంతో పాటు సమాజాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించాలని సూచించారు. ‘యునైటెడ్ ఇన్ సర్వీస్’ అనే 2026 సిఎస్ఐ క్యాలెండర్ సందేశానికి అనుగుణంగా సేవా కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. కార్యక్రమంలో రెవరెండ్ ఎం. జోసెఫ్ కిషోర్, ప్రెస్ బైటర్ ఇన్ చార్జి, చర్చి ఆఫీస్ బేరర్లు, పాస్టోరేట్ కమిటీ సభ్యులు, మనోహరాబాద్ సిఎస్ఐ చర్చి ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!