🔸కౌన్సిలర్ కోడూరి మౌనిక దినేష్ చేతుల మీదుగా పంపిణీ
ఆర్.జె.న్యూస్,అలియాబాద్ : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ కోడూరి మౌనిక దినేష్ పాల్గొని విద్యార్థులకు స్వయంగా షూస్ అందజేశారు. షూస్ అందుకున్న విద్యార్థుల ముఖాల్లో కనిపించిన సంతోషం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆమె అన్నారు. మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. విద్యతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రతపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, పూర్ణిమ, కవిత, స్వప్న, పాఠశాల సిబ్బంది, మహిళా మండలి సభ్యులు సోని, ధనలక్ష్మి, పర్వీన్ సుల్తానా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
