ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని కాసోనిబాయి తండా 2వ వార్డు శారద రాజునాయక్ ఆధ్వర్యంలో గురువారం తీజ్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువత సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీజ్ పాటలు, నృత్యాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఏనుగు సుదర్శన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్, వైస్ చైర్‌పర్సన్ రజిత దేవేందర్, అర్చన శ్రీనివాస్, మహేశ్వరి రాజేష్, శ్రీనివాస్ గౌడ్, తదితరులు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.
