Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లాఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌కు జిల్లా ప్రశంసా పత్రం

ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌కు జిల్లా ప్రశంసా పత్రం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌కు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ప్రశంసా పత్రం లభించింది. జిల్లా కలెక్టర్‌ మను చౌదరి సమక్షంలో ఐపీఎస్‌ అధికారి సురేష్‌కుమార్‌ ప్రశంసా పత్రాన్ని ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌కు అందజేశారు. అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే ప్రశాంత్‌ సమర్థవంతమైన విధులు నిర్వహించి ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపును అందుకున్నారు. కీలక కేసుల ఛేదనలో చురుకైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు విశేష కృషి చేశారు. విధి నిర్వహణలో అంకితభావం, సత్వర స్పందన, వృత్తిపరమైన నైపుణ్యంతో ఆదర్శంగా నిలిచారు.ప్రశాంత్‌ నాయకత్వంపై అల్వాల్‌ పోలీసు సిబ్బంది, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా భద్రత కోసం ఆయన చేస్తున్న సేవలకు ఈ ప్రశంసా పత్రం నిదర్శనమని పేర్కొన్నారు. ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌కు పలువురు అభినందనలు తెలిపి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!