Sunday, November 8, 2026
Homeమేడ్చల్ జిల్లాఇందిరమ్మ ఇళ్లలో వెలుగుల దీపావళి

ఇందిరమ్మ ఇళ్లలో వెలుగుల దీపావళి

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, జవహర్ నగర్ : జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మాజీ మేయర్, డివిజన్ అధ్యక్షులు దొంతగాని కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో లబ్దిదారులు టపాసులు పేల్చి, దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లబ్దిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సొంత ఇంటి కల నెరవేరడంతో ఈ దీపావళి తమ జీవితంలో మరపురాని పండుగగా మిగిలిపోతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్, కార్పొరేటర్ మనోహర్ రెడ్డి, చింతల శ్రీనివాస్, కృష్ణాగౌడ్, తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అనంతలక్ష్మి, మేడ్చల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాట్ల శ్రీనివాస్, జవహర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు మాట్ల వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయకం భాస్కర్, గజ్వెల్ శంకర్, కోశాధికారి పొలాస కిరణ్ కుమార్, సోమేశ్ చారీ, కోయడ అజయ్ కుమార్, రేణుక, జూలేక, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!