లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
ఆర్.జె.న్యూస్, శామీర్‌పేట : వినాయక నిమజ్జనాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎంఎంసీ జోనల్ కమిషనర్ సంచిత్ గంగువార్, మల్కాజ్‌గిరి డీసీపీలు శ్రీధర్, రాహుల్‌రెడ్డి అన్నారు. శామీర్‌పేట చెరువులో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన ఘాట్‌ను మంగళవారం అధికారులు బృందం పరిశీలించింది. నిమజ్జనాలు శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు, భక్తులు, వాహనదారులు ట్రాఫిక్, భద్రతా నియమాలు పాటించి నిమజ్జనాలకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ డీసీపీలు శ్రీధర్, రాహుల్‌రెడ్డి, మల్కాజ్‌గిరి మున్సిపల్ జోనల్ కమిషనర్ సంచిత్ గంగువార్, కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రామలింగం, ఏసీపీలు చక్రపాణి, శంకర్‌రాజు, సీఐలు నర్సింహారెడ్డి, పవన్‌కుమార్, జానకిరామ్, ఎస్‌ఐ నవీన్‌రెడ్డి, డీఐ మహేశ్, ఆర్‌అండ్‌బీ డీఈ మోహన్‌చారి, ఎస్సీ లక్ష్మణ్, ఆర్టీఏ జిల్లా సభ్యుడు జైపాల్‌రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జిల్లా కన్వీనర్ నూనెముంతల రవీందర్‌గౌడ్, శ్రీనివాస్, రాకేశ్, నాగరాజు, బంటిగౌడ్, పీసీసీ కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
