ఆర్.జె.న్యూస్, శామీర్‌పేట : ఉపాధ్యాయ వృత్తి సమాజానికి మార్గదర్శకమని, విద్యాబుద్ధులతో పాటు సమాజానికి కావాల్సిన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంటం శిరీషా కృష్ణారెడ్డి అన్నారు.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం తూంకుంట విశ్వవిశ్వానిలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆర్టీఏ జిల్లా సభ్యుడు భీమిడి జైపాల్‌రెడ్డితో కలిసి మండల స్థాయిలో 14 మంది, జిల్లా స్థాయిలో ఆరుగురు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో కమలాకర్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
