Saturday, October 3, 2026
Homeమేడ్చల్ జిల్లాచంద్రపురి, జవహర్ నగర్ లో గ్రంథాలయం...

చంద్రపురి, జవహర్ నగర్ లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి – మల్లెపూల శ్రీకాంత్ యాదవ్

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, జవహర్ నగర్ : కీసర సర్కిల్ పరిధిలోని చంద్రపురి కాలనీ డివిజన్, జవహర్ నగర్ డివిజన్లలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రంథాలయ ఏర్పాటుకు స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు గొడుగు వేణు, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, బల్లి శ్రీనివాస్, బింగి సతీష్ గౌడ్, మనోహర్ రెడ్డి, నాయకులు మాట్ల వినయ్ కుమార్, యాదగిరి యాదవ్, మాధవరెడ్డి, ఎర్రగుంట్ల వెంకటేష్, వీర్ల బుజ్జి, నాయకం భాస్కర్, నర మహేష్, బబ్లూ ముదిరాజ్, గజ్వేల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!