ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మహిళను మోసం చేసి, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగికంగా వేధించిన కేసులో నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం… ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న బాధితురాలికి షేక్ నబీతో పరిచయం ఏర్పడింది. 2023లో పార్టీ సందర్భంగా ఆమెకు తెలియకుండా కూల్ డ్రింక్ లో మత్తు పదార్థం కలిపి లైంగిక దాడికి పాల్పడి, ఫోటోలు, వీడియోలు తీసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం రెస్టారెంట్ వ్యాపారం పేరుతో బాధితురాలి నుంచి సుమారు రూ.43 లక్షలు వసూలు చేసినట్లు తెలిపింది. తన వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలను భర్త, పిల్లలు, బంధువులకు పంపిస్తానని బెదిరిస్తూ పలుమార్లు లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. బాధితురాలు విషయాన్ని భర్తకు చెప్పగా, ఆయన సూచన మేరకు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కార్యాలయంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
మహిళను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్
RELATED ARTICLES
