ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ (ఏబీఏపీ) మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీగా కొల్తూరు గ్రామానికి చెందిన తొర్రి మల్లేష్ నియమితులయ్యారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దెమర్రి గ్రామంలోని శ్రీ అక్కన్న మాదన్న శ్రీ విష్ణు శివాలయంలో ఏబీఏపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ నియామకాన్ని ప్రకటించారు.సమావేశానికి ఏబీఏపీ జాతీయ కోశాధికారి రాయబారపు రవిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జనరల్ సెక్రటరీ నియామకంపై చర్చించి మల్లేష్‌ను బాధ్యతల్లోకి తీసుకున్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మల్లేష్‌ను రాయబారపు రవిరాజు, శ్రీపతి నాగరాజుతో పాటు అయ్యప్ప గురుస్వాములు, భక్తులు అభినందించారు.అయ్యప్ప ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు భక్తులను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు మల్లేష్ కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. సంస్థ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఏబీఏపీ అభివృద్ధికి కృషి చేస్తానని మల్లేష్ తెలిపారు.కార్యక్రమంలో సత్యం గురుస్వామితో పాటు పలువురు అయ్యప్ప గురుస్వాములు, భక్తులు పాల్గొన్నారు.
మల్లేష్‌కు ఏబీఏపీ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ బాధ్యతలు
RELATED ARTICLES
