Wednesday, November 25, 2026
Homeక్రైమ్ న్యూస్నగల దుకాణంలో భారీ చోరీ.. రూ.80...

నగల దుకాణంలో భారీ చోరీ.. రూ.80 లక్షల సొత్తు అపహరణ

📰 Generate e-Paper Clip

🔸గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దుండగులు.. 25 తులాల బంగారం, 3.5 కిలోల వెండి, నగదు మాయం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలో భారీ నగల చోరీ ఘటన కలకలం రేపింది. జాతీయ రహదారికి ఆనుకుని, పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్న జగదాంబ జువెల్లర్స్ దుకాణంలో దుండగులు గోడకు కన్నం వేసి చోరీకి పాల్పడ్డారు. సుమారు 25 తులాల బంగారం, 3.5 కిలోల వెండి నగలతో పాటు రూ.4 లక్షల నగదును అపహరించుకెళ్లారు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.80 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపాడు.
పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. శేషుమాల్ చౌదరి మేడ్చల్ పోలీస్‌స్టేషన్ సమీపంలో శ్రీ జగదాంబ జువెల్లర్స్ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నారు. ఆదివారం దీపావళి పూజలు నిర్వహించిన అనంతరం దుకాణానికి తాళం వేసి వెళ్లిపోయారు. సోమవారం దుకాణం తెరవలేదు. మంగళవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా లోపల చెక్క తలుపు ధ్వంసమై కనిపించింది. అనుమానంతో లోపలికి వెళ్లి పరిశీలించగా వెనుక గోడకు పెద్ద కన్నం వేసి ఉండటాన్ని గుర్తించారు.దుండగులు వెనుక వైపు నుంచి గోడకు రంధ్రం చేసి దుకాణంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అనంతరం అడ్డుగా ఉన్న చెక్క తలుపును తొలగించి నగలు విక్రయించే గదిలోకి చేరుకున్నారు. అక్కడ ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు డ్రాలోని నగదును ఎత్తుకెళ్లారు.సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!