🔸టీం తల్వార్ ఆధ్వర్యంలో ఘనంగా సదర్ సమ్మేళనం
🔸యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు రాఘవేంద్ర గౌడ్
ఆర్ జె న్యూస్,మేడ్చల్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, యాదవ సోదరుల ఐక్యతకు సదర్ ఉత్సవాలు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ అన్నారు. మేడ్చల్ పట్టణ కేంద్రంలో టీం తల్వార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ సోదరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉత్సవాల్లో భాగంగా దున్నపోతుల విన్యాసాలను తిలకించిన రాఘవేంద్ర గౌడ్ యాదవ సోదరులకు, నియోజకవర్గ ప్రజలకు సదర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రుడి గర్వాన్ని అణచి, గోవర్ధనగిరిని ఎత్తి గోవులను, యాదవులను రక్షించిన ఘట్టానికి గుర్తుగా సదర్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలకు మరింత ఆదరణ పెరిగిందని పేర్కొన్నారు. మేడ్చల్లో యాదవ సోదరులంతా ఏకతాటిపైకి వచ్చి ఉత్సాహంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమానికి, ముఖ్యంగా గొల్ల, కురుమ, యాదవ సోదరుల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. యాదవుల ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. సదర్ ఉత్సవాలు సమాజంలో సోదరభావం, ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గౌడవెళ్లి మాజీ సర్పంచ్, గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గరిసెల సురేందర్ ముదిరాజ్, మేడ్చల్ మాజీ కౌన్సిలర్లు పెంజర్ల స్వామి యాదవ్, కౌడే మహేష్ కురుమ, బత్తుల శివకుమార్ యాదవ్, మాజీ డైరెక్టర్లు ఒగ్గు శంకర్ కురుమ, గౌర్ల ఎర్ర బీరప్ప కురుమ, మాజీ వార్డు సభ్యుడు కౌడే నాగేందర్ కురుమ, సంఘం నాయకులు బత్తుల మధుకర్ యాదవ్, కౌడే భిక్షపతి, గౌర్ల మధు, ఒగ్గు సురేష్, కౌడే శ్రీశైలం, శ్రీరంగవరం నర్సింహ, మైల జీతయ్య, పెంజర్ల భాస్కర్, ఒగ్గు వినోద్, కౌడే శ్రీనివాస్, పెంజర్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో యాదవ సోదరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు
