ఆర్ జె న్యూస్ మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులోని లింగాపూర్ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన నూతన బోర్‌వెల్‌ను స్థానిక కౌన్సిలర్ వేణు గోపాల్ తో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఛైర్పర్సన్ శ్రీదేవి మాట్లాడుతూ తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని బోర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బోర్ ద్వారా వార్డులోని ప్రజలకు తాగునీటి సరఫరా మెరుగుపడి, నీటి సమస్యకు కొంత మేర ఉపశమనం కలగనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమిషనర్ కృష్ణ రెడ్డి , వైస్ చైర్మన్ రజిత దేవేందర్ రెడ్డి,రమేష్, ఓంప్రకాష్,సురేందర్, సంజీవ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు..
15వ వార్డులో నూతన బోర్‌వెల్ ప్రారంభం.! ముఖ్య అతిథిగా చైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్
RELATED ARTICLES
