ఆర్.జె.న్యూస్, మేడ్చల్: ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడమే జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయం (ఐడీఓసీ) సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడంలో శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రజావాణిలో వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి మొత్తం 75 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మాలతి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం: అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
RELATED ARTICLES
