🔸నియామక పత్రం అందజేసిన మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ ఎం.డి. ఖాజామొయినుద్దీన్
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా రాజ్బొల్లారం పాషా (మొహమ్మద్ పాషా మియా)ను నియమించినట్లు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ మైనారిటీ విభాగం చైర్మన్ ఎం.డి. ఖాజామొయినుద్దీన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. టీపీసీసీ మైనారిటీ విభాగం చైర్మన్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ, మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం చైర్మన్ మిర్జా అజిజుల్లా బేగ్ ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు పేర్కొన్నారు.పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, మైనారిటీ విభాగాన్ని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నూతన అధ్యక్షుడు రాజ్బొల్లారం పాషాకు ఎం.డి. ఖాజామొయినుద్దీన్ సూచించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
