Friday, November 27, 2026
Homeక్రైమ్ న్యూస్కీసరలో దోపిడీ దొంగ అరెస్ట్‌!

కీసరలో దోపిడీ దొంగ అరెస్ట్‌!

📰 Generate e-Paper Clip

🔸వాహనదారుడిని చంపేస్తానని బెదిరించి బంగారు ఆభరణాలు అపహరణ.. నాలుగు తులాల బంగారం, ఫోన్‌ స్వాధీనం

ఆర్ జె న్యూస్, కీసర : పరిచయం పెంచుకుని వాహనంపై లిఫ్ట్‌ తీసుకున్నాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపేస్తానని బెదిరించాడు.. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ లాక్కొని పరారయ్యాడు. ఈ దోపిడీకి పాల్పడిన నిందితుడిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి నాలుగు తులాల బంగారు గొలుసు, బ్రాస్‌లెట్‌, పోకో ఎఫ్‌27 మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 23న తెల్లవారుజామున చక్రిపురంలోని శ్రీరత్న హోటల్‌ వద్ద బాధితుడికి మహమ్మద్‌ మౌలానా అలియాస్‌ అబ్దుల్‌ బారి పరిచయమయ్యాడు. బిర్యానీ తినాలంటూ బాధితుడి స్కూటీపై ఎక్కి ఇద్దరూ నగరంలోని అరేబియన్‌ నైట్‌ మరాబహ మండిలో భోజనం చేశారు. అనంతరం దమ్మాయిగూడలో దింపాలని కోరడంతో బాధితుడు అతడిని స్కూటీపై తీసుకెళ్లాడు.తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో దమ్మాయిగూడలోని ఐకామ్‌ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే నిందితుడు స్కూటీని ఆపించి బాధితుడిని చంపేస్తానని బెదిరించాడు. భయాందోళనకు గురైన బాధితుడి నుంచి బంగారు గొలుసు, బ్రాస్‌లెట్‌, మొబైల్‌ ఫోన్‌ బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. అతడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!