Friday, November 27, 2026
Homeక్రైమ్ న్యూస్కీసరలో దొంగ అరెస్ట్‌

కీసరలో దొంగ అరెస్ట్‌

📰 Generate e-Paper Clip

🔸నాలుగు తులాల బంగారు గొలుసు, బ్రాస్‌లెట్‌, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : రాత్రివేళ ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, మొబైల్‌ ఫోన్‌ చోరీకి పాల్పడిన నిందితుడిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి నాలుగు తులాల బంగారు గొలుసు, బ్రాస్‌లెట్‌, పోకో ఎఫ్‌27 మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ చక్రపాణి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 23న తెల్లవారుజామున కీసరలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహమ్మద్‌ మౌలానా అలియాస్‌ అబ్దుల్‌ బారిని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. సెంట్రింగ్‌ పనులు చేసే నిందితుడు మౌలాలి పరిధిలోని బిక్కగూడ, హబ్సిగూడ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు తెలిపారు. అతడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వివరించారు.ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!