Friday, November 27, 2026
Homeమేడ్చల్ జిల్లాసొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్లను...

సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన మహేశ్‌ గౌడ్‌

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, ఘట్‌కేసర్‌: సొంతింటి కల ప్రతి పేద కుటుంబానికి ఒక జీవితకాల స్వప్నం. ఆ కలను నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ సర్కిల్‌ ఎదులాబాద్‌ డివిజన్‌ పరిధిలోని ఘనపురం గ్రామం ఫకీర్‌ టేక్య తండలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం కన్నుల పండువగా జరిగింది.

లబ్ధిదారులు మాలోత్‌ సుగుణ, మూడవత్‌ యాకుబ్‌ నాయక్‌, వడ్త్యా రతన్‌ సింగ్‌ ఆహ్వానం మేరకు మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్‌ డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేశ్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని పేర్కొన్నారు. సొంతింటితో కుటుంబాలకు భద్రత, ఆత్మగౌరవం, భరోసా కలుగుతాయని అన్నారు. కార్యక్రమంలో ఘనపురం గ్రామ మాజీ సర్పంచులు నానావత్‌ రూప్‌సింగ్‌ నాయక్‌, వేముల మమత గౌడ్‌, బద్దం గోపాల్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ వేముల సత్తయ్య గౌడ్‌, ఎదులాబాద్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు వేముల శంకర్‌ గౌడ్‌, డివిజన్‌ కార్యదర్శి తాటికొండ మల్లేశ్‌ గౌడ్‌, మాజీ వార్డు సభ్యులు నానావత్‌ సురేశ్‌ నాయక్‌, రామావత్‌ రాణితో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!