Sunday, October 11, 2026
Homeక్రైమ్ న్యూస్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత!

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కార్ పార్కింగ్ ప్రాంతంలో 21 కిలోల 499 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 9, 2026న అందిన విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఓటీ మల్కాజిగిరి బృందం, గోపాలపురం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. క్లూస్ టీమ్, స్వతంత్ర సాక్షుల సమక్షంలో చేపట్టిన తనిఖీల్లో ఇద్దరు మహిళల లగేజీలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల ప్రెస్‌నోట్ ప్రకారం, ముంబైకి చెందిన లక్ష్మీ శంకర్ నటేకర్, జయ అలీముల్లా సర్దార్ అనే ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న పది ప్యాకెట్లలో మొత్తం 21 కిలోల 499 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లు, రూ.3,500 నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గంజాయిని ముంబైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు నిందితులు తెలిపినట్టు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!