Friday, November 6, 2026
Homeక్రైమ్ న్యూస్మూడో తరగతి విద్యార్థిపై లైంగిక దాడి

మూడో తరగతి విద్యార్థిపై లైంగిక దాడి

📰 Generate e-Paper Clip

🔸నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష*👏

🔸అల్వాల్‌ పోలీసుల కేసులో నేరం రుజువు
🔸రూ.3 వేల జరిమానా.. బాధితుడికి రూ.3 లక్షల పరిహారం

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : మూడో తరగతి చదువుతున్న బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి మేడ్చల్‌ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఎటికెల రాజశేఖర్‌ అలియాస్‌ చిన్నా (27)కు ఈ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి కె.వెంకటేష్‌ గురువారం తీర్పు వెలువరించారు.

ఆరేళ్ల విచారణ.. నేరం రుజువు

2019లో అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడో తరగతి విద్యార్థిపై లైంగిక దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖానాజిగూడ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రాజశేఖర్‌పై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేల జరిమానా విధించారు. బాధిత బాలుడికి రూ.3 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది.

పోలీసుల దర్యాప్తు.. ప్రాసిక్యూషన్‌ వాదనలు

ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా ఇన్‌స్పెక్టర్‌ పి.యాదగిరి, రెండో దర్యాప్తు అధికారిగా ఏసీపీ ఏవీఆర్‌ నరసింహారావు వ్యవహరించారు. ప్రస్తుతం అల్వాల్‌ సీఐగా ఉన్న ప్రశాంత్‌ కూడా కేసు ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రభాకర్‌రెడ్డి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఈ కేసు వివరాలను గురువారం ఆయన మీడియాకు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!