Saturday, September 12, 2026
Homeమేడ్చల్ జిల్లాప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం :...

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం : కూన శ్రీశైలం గౌడ్

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, కుత్బుల్లాపూర్ : నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీలకు చెందిన ప్రజలు షాపూర్‌నగర్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి స్థానిక సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. కాలనీల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం తదితర మౌలిక వసతుల కల్పనపై ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అలాగే పలువురు కుటుంబ శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను అందజేసి కార్యక్రమాలకు ఆహ్వానించారు. వినతిపత్రాలను పరిశీలించిన కూన శ్రీశైలం గౌడ్, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అత్యవసర సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించగా, మిగిలిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి పనిచేయడం తన బాధ్యత అని, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!