ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ అన్నారు. గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని సుతారిగూడలో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.పౌరసరఫరాల అధికారులు, స్థానిక రేషన్ డీలర్, ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని తెలిపారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని, అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఓబీసీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రవి ముదిరాజ్, మాజీ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచులు బేరి ఈశ్వర్, బండారి నరేందర్ ముదిరాజ్, మేడ్చల్ మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గోమారం రమణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ చిల్ల వెంకటేష్ ముదిరాజ్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సాకారబోయిన మల్లేష్ ముదిరాజ్, ఎల్.వినోద్‌గౌడ్, చిల్ల సాయి ముదిరాజ్, రాజు ముదిరాజ్, భాస్కర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

