Wednesday, October 7, 2026
Homeమేడ్చల్ జిల్లాతాళం వేసిన ఇళ్లే టార్గెట్.. వరుస...

తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. వరుస చోరీలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్

📰 Generate e-Paper Clip

🔸ఆర్థిక ఇబ్బందులతో దొంగగా మారిన మాజీ ఉద్యోగి.. 9 ఇళ్లలో చోరీలు

🔸బంగారు బిస్కెట్లు విక్రయిస్తుండగా పట్టుకున్న పోచారం పోలీసులు

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : తాళం వేసి ఉన్న ఇళ్లను ముందుగా రెక్కీ చేసి, యజమానులు లేని సమయంలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా నల్గొండ జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం తొమ్మిది తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఇన్‌స్పెక్టర్ జగన్నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అలుగుబెల్లి రాము అలియాస్ జయరాం రెడ్డి (29). మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజీగూడలోని ఆర్జీకే, ప్రకాష్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్వస్థలం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం. గతంలో డెక్సన్ కంపెనీలో లీడ్ కన్సల్టెన్సీగా ఉద్యోగం చేశాడు. ఆన్‌లైన్ పెట్టుబడుల్లో నష్టపోవడంతో పాటు ఉద్యోగం కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. దీంతో దొంగతనాలకు పాల్పడటం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదు, చిట్యాల పరిధిలో ఒకటి, నల్లగొండ రూరల్ పరిధిలో ఒకటి, కట్టంగూర్ పరిధిలో ఒకటి, తిప్పర్తి పరిధిలో ఒకటి చొప్పున మొత్తం తొమ్మిది తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఆగస్టు 23న తెల్లవారుజామున అన్నోజీగూడ ప్రకాష్‌నగర్ కాలనీలో తన నివాసం పక్కనే ఉన్న తాళం వేసిన ఇంటిని నిందితుడు టార్గెట్ చేశాడు. ఇంట్లోకి చొరబడి ఒక నాన్‌తాడు చైన్, ఒక బ్రాస్లెట్, రెండు జతల చెవి దుద్దులు, ఒక వంకి రింగు, ఒక మలబార్ బంగారు బిస్కెట్, ఆరు బిస్కెట్ కటింగ్ ముక్కలు.. మొత్తం 14 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.2 వేల నగదును అపహరించాడు. చోరీ చేసిన బంగారాన్ని అక్టోబర్ 5న జోడిమెట్ల ఎక్స్‌రోడ్ సమీపంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 20 గ్రాముల బరువున్న ఒక మలబార్ బంగారు బిస్కెట్, మొత్తం 60 గ్రాముల బరువున్న ఆరు బంగారు బిస్కెట్ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడి నివాసంలో తనిఖీలు నిర్వహించి మిగిలిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మంగళవారం సాయంత్రం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఇన్స్పెక్టర్ జగన్నాథ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!